W.G: భీమవరం మండలం జొన్నలగరువులో పురిటి నొప్పితో బాధపడుతున్న మహిళకు 108 సిబ్బంది సకాలంలో స్పందించి, మార్గమధ్యంలోనే సురక్షితంగా ప్రసవం చేశారు. నరసాపురం సిబ్బంది సంజీవ్ కుమార్, బి. రత్నసాగర్లు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, నొప్పులు అధికమవడంతో వాహనంలోనే డెలివరీ నిర్వహించారు. అనంతరం తల్లిని, బిడ్డను తుండూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు.