BDK: పాల్వంచ పట్టణంలో ఆదివారం సీపీఐ భద్రాద్రి జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎర్ర జెండా ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు.