ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ ఎస్ బ్యాంకు నికర లాభం రూ.654 కోట్లకు చేరింది. గత క్యూ2లో నమోదైన రూ.553 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది. ఇక లోన్బుక్ 6.4 శాతం వృద్ధి చెందడంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 0.10 శాతం మెరుగుపడి 4.6 శాతానికి చేరింది. ఇతర ఆదాయం 16.9 శాతం పెరిగి రూ. 1,644 కోట్లుగా నమోదైంది.