NLG: మర్రిగూడలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను, నూతనంగా నిర్మించిన అదనపు గదులను మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అసెంబ్లీ పరిధిలోని పాఠశాలలను బలోపేతం చేయడమే తన లక్ష్యం అని అన్నారు. సుశీలమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ లక్ష్మితో కలిసి ఆయన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.