SRPT: హైదరాబాద్ నగర సీపీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌ను ఇవాళ కోదాడ పట్టణానికి చెందిన, TG ఫోక్ కవి, గాయకుడు ఇంద్రకుమార్ HYDలోని ఆయన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంద్ర కుమార్ మాట్లాడుతూ… విధుల పట్ల అంకితభావంతో పనిచేసే ఉత్తమ అధికారిని, పోలీస్ శాఖలో పేరు ఉన్న ఉన్నత అధికారిని కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సజ్జనార్ ఆదర్శాలే నాకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.