MDK: విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొంటూ, అందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మెదక్ మండలం పాతూరు సబ్ స్టేషన్ సందర్శించారు. విద్యుత్ సరఫరా తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా జరగాలన్నారు.