VKB: దోమ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కోతుల బెడద తీవ్రంగా పెరిగింది. రోజు రోజుకీ వందల సంఖ్యలో వానరాలు గ్రామంలోకి దూసుకువచ్చి ఇళ్ల పైకప్పులు, విలువైన వస్తువులను ధ్వంసం చేస్తున్నాయి. కళాశాలకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. పంటలు, పండ్ల తోటలకు భారీ నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.