దీపావళి పండుగ జరుపుకోవడం వెనుక ఓ కథ ఉంది. దీపావళి అంటేనే ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయం’ అని అర్థం. సముద్ర మథనం జరిగినప్పుడు శ్రీ మహాలక్ష్మీ దేవి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి రోజున లక్ష్మీదేవీ తమ ఇళ్లకు వస్తుందని నమ్మి, ఇంట్లోని చీకటిని పారదోలి, దీపాలతో స్వాగతం పలుకుతారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ పూజ చాలా ప్రాముఖ్యం.