NZB: సాలూర మండలంలోని ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ప్రారంభించారు. పథకం సజావుగా నిర్వహించేందుకు రైతులందరూ సకాలంలో డబ్బులు చెల్లించి సహకరించాలని సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ ఛైర్మన్, కమిటీ సభ్యులు కోరారు. రైతులందరికీ నీరు అందించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కమిటీ హామీ ఇచ్చింది. లిఫ్ట్ ఇరిగేషన్ ఛైర్మన్ శివ పటేల్, సాలుర గ్రామస్థులు పాల్గొన్నారు.