SRD: ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల అండర్- 19 రగ్బీ ఎంపికలు ఈనెల 21వ తేదీన నారాయణఖేడ్‌లోని మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం ఆదివారం తెలిపారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. బోనాఫైడ్, పదవ తరగతి మెమో, జన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.