‘బాహుబలి’ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్‌తో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ‘Don’t Trouble The Trouble’ సినిమా చేస్తున్నారు. గతేడాదిలో ఈ మూవీపై అధికారిక ప్రకటన రాగా.. తాజాగా దీని షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మూవీ సెట్స్‌లో ఫహాద్ అడుగుపెట్టారు. ఈ సినిమాతో శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.