NLR: ఆదివారం ఉదయం దుత్తలూరు మండలం, తెడ్డుపాడు వద్ద పిల్లాపేరు వంతెన సమీపంలో హైవే లైనింగ్ వాల్‌ను ఢీకొట్టి టమాటో వాహనం బోల్తా పడింది. కర్నూల్ నుంచి ఒడిశాకు వెళ్తున్న ఈ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన డ్రైవర్‌కు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.