AP: మన్యం జిల్లా పార్వతీపురం RTC కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. RTC బస్సు నుంచి ANL పార్సిల్ దించుతుండగా పేలుడు జరిగింది. బాణసంచా లేక ఏమైనా బాంబులున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.