BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్తీకమాసం పునస్కరించుకుని కొండకింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రవి నాయక్ తెలిపారు. ఈనెల 22 నుంచి నవంబర్ 20 వరకు ప్రతిరోజు ఆరు విడతల వ్రతాలు ఆచరించేందుకు వసతి కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటలకు, 9గం, 11గం లకు, మధ్యాహ్నం 1గం, 3గం, 5గం,లకు వ్రతాలు కొనసాగుతాయి.