NLG: నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి కొండపైన శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానము, శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఆలయ ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి రాజేశ్వరి దేవి దంపతులు పాల్గొన్నారు.