BDK: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీదేవి పల్లి, ఆళ్లపల్లి, పాల్వంచ మండలాల ఆదివాసీ నాయకులు వాసం రామకృష్ణ దొర ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు ఆదివారం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో GSS రాష్ట్ర యువజన నాయకులు ప్రశాంత్ పాల్గొని మాట్లాడుతూ.. యువత క్రీడల ద్వారా శరీర దృఢత్వం పెంచుకుంటూ ఉల్లాసంగా ఉండాలన్నారు. అలాగే చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు.