ASF: రెబ్బెన మండలం కైరిగూడ గ్రామపంచాయతీలో ఆదివారం జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆత్మరామ్ నాయక్ హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఆటలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని యువత క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలన్నారు.