VSP: తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద భాషాభిమానులు, సాహితీవేత్తలు కలిసి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నవంబర్ 1న జరపాలని ఆదివారం డిమాండ్ చేశారు. అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి సీఎంకు బహిరంగ లేఖ విడుదల చేస్తూ.. “మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థ” ఏర్పాటు చేసి తెలుగు భాష అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.