E.G: ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి, వాటిని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు కోరారు. గోపాలపురం మండలం క్లస్టర్ కాంప్లెక్స్ పర్యవేక్షణలో భాగంగా ఆదివారం ఆయన రాజంపాలెం క్లస్టర్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని అన్నారు.