PPM: వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలపై అవగాహన పెంపొందించాలని DMHO డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు. బెలగం 16వ వార్డులో గల గిరిజన సంక్షేమ హాస్టల్‌ను ఆర్.బిఎస్.కె అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావుతో కలసి ఆదివారం సందర్శించారు. హాస్టల్ వసతులు, పరిశుభ్రతపై పరిశీలించారు. విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నారా అని వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు.