NZB: బోధన్ రూరల్ మండలం అమ్డాపూర్ శివారులో ఆదివారం పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6,180 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. మరో సందర్భంలో చిన్నమావంది గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి మరో నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.5,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.