విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. బీజేపీ మోసాన్ని గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమానించిందని, ఓటరు జాబితాలు మార్చి ప్రజల ఓటు హక్కు హరించిందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.