TG: శిల్పకలా వేదికలో ఏర్పాటు చేసిన లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కింద 3,465 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం చేపట్టారు. ప్రతి మండలానికి నలుగురు నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.