మహిళల ప్రపంచకప్ టోర్నీలో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో ఇండోర్ వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు వరుస ఓటములతో కసిగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని తహతహలాడుతోంది.