KNR: దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సూచించారు. ప్రజలు సమగ్ర భద్రతా నియమాలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన కోరారు. చిన్నపిల్లలు పెద్దల సమక్షంలోనే టపాసులు పేల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.