GNTR: ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్ఐ సురేశ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, రౌడీషీటర్లు శాంతియుతంగా జీవించాలని, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు. రౌడీషీటర్లలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.