అనంతపురంలో సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. జయనగర్ కాలనీలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఆమెను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫ్యాన్స్ అందరికీ హీరోయిన్ మీనాక్షి చౌదరి అభివాదం చేసి, ఉత్సాహపరిచారు.