తమ దేశ నేషనల్ టైమ్ సెంటర్‌పై అమెరికా సైబర్ దాడి చేసిందని చైనా ఆరోపించింది. ఈ హ్యాకింగ్ వెనక అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హస్తం ఉందని చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ వెల్లడించింది. టైమ్ సెంటర్లోని ఉద్యోగుల ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని తస్కరించినట్లు తెలిపింది. అయితే ఈ ఆరోపణలపై అమెరికా ఇంతవరకు స్పందించలేదు.