ASF: ఈనెల 22 నుంచి బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, DEO దీపక్ తివారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో పోటీలు నిర్వహిస్తామన్నారు. అండర్-14,17 విభాగాల్లో హ్యాండ్ బాల్, ఖోఖో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు పాఠశాలలో సంప్రదించాలన్నారు.