SKLM: కార్తీకమాసం అత్యంత విశిష్టత కలిగినది. కార్తీకమాసంలో పవిత్ర పుణ్యస్నానాలు, కార్తీక దీపారాధన, వ్రతాలు, ఉపవాసాలు చేస్తుంటారు. శ్రీకాకుళం జిల్లాలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి దేవస్థానం, శ్రీముఖలింగం-ముఖలింగేశ్వరస్వామి, పలాస-స్వయంభూలింగేశ్వరస్వామి, పాతపట్నం-నీలకంటేశ్వరస్వామి,శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయాలు ప్రత్యేక స్థానంలో ఉన్నాయి.