SRPT: తుంగతుర్తి మండలం వెంపటికి చెందిన నిరుపేద షేక్. పాషకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, తమవంతుగా అతడితో చదువుకున్న 2008-09 పదవ తరగతి స్నేహితులు ఆదివారం రూ.15వేలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేశారు. స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలు పంచుకోవడమే స్నేహ బంధం అని స్నేహితులు తెలిపారు.