JGL: వేములకుర్తి గ్రామంలో విద్యుత్ శాఖ లైన్మెన్ కొలిపాక రాజు, పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని గ్రామంలో మైక్ పట్టుకుని తిరిగి చాటింపు వేస్తూ వినుత్నంగా ప్రయత్నించారు. ఆదివారం గ్రామంలో విద్యుత్ శాఖకు తమ వాడుకున్న కరెంటు బిల్లులు కట్టాలని కోరుతూ చిన్న మైకును పట్టుకుని వార్డులలో తిరుగుతూ కరెంటు బిల్లులు వసూలు చేశారు.