SRD: కంగ్టి మండలం తుర్క వడగాంకు చెందిన పోతిరెడ్డి అపర్ణ రెడ్డి గ్రూప్ -2 ఫలితాల్లో సత్తా చాటి సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. గతేడాది గ్రూప్-4లో అర్హత పొంది జూనియర్ అసిస్టెంట్‌గా ఖేడ్ సబ్ కలెక్టర్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్ 2 ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నట్లు నేడు తెలిపారు.