WGL: నెక్కొండ మండలంలో ఆదివారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి, పత్తి పంటలు దెబ్బతింటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. ఈ అకాల వర్షంతో అన్నదాతలకు అపార నష్టం కలిగించింది. రైతులు పొలాల వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.