రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ జైల్లో ఉన్నాడు. ఆయనకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను సమర్పించింది. జైలు నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని సౌకర్యాలు అందుతున్నాయని తెలిపింది. ఆయనకు అరికాళ్లలో ఫంగస్ వల్ల నొప్పులు వస్తున్నాయని, వైద్యులు వారానికి 2సార్లు అతన్ని పరిశీలిస్తున్నారని పేర్కొంది.