RR: బీసీల 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. ఈ సందర్భంగా చౌదరిగూడ మండలంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల హక్కులను కాలరాస్తుంది బీజేపీ ప్రభుత్వమేనని, పేరుకే బీసీ ప్రధాని అని కానీ.. ఆయన పరిపాలన అంత ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో సాగుతుందని విమర్శించారు.