KNR: రహదారులపై పంట ధాన్యం ఆరబెట్టి ప్రమాదాలు సృష్టిస్తే చర్యలు తప్పవని వీణవంక ఎస్సై తిరుపతి హెచ్చరించారు. రోడ్లు ప్రజల వినియోగానికి చెందినవని, వాటిపై ధాన్యం ఆరబెట్టడం భారతీయ న్యాయ సంహిత (BNS-2023) సెక్షన్ల ప్రకారం శిక్షార్హమని ఆయన తెలిపారు. రైతులు తమ పంటలను రోడ్లపై కాకుండా, గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.