MDK: రేగోడ్ మండలంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అక్రమాలపై అధికారులు దృష్టి సారించారు. రూ.70వేల రికవరీతో పాటు 3వేల జరిమానాలు విధించినట్లు అడిషనల్ DRDO రంగాచారి తెలిపారు. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ.3.12 కోట్ల నిధులతో ఉపాధి పనులు జరిగాయని పేర్కొన్నారు. తనిఖీల్లో కొన్ని గ్రామాల్లో అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు. పనులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.