SKLM: సంతబొమ్మాలి బస్టాండ్ వద్ద ఆదివారం పోలీసులు సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిస కావద్దని, భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితువు పలికారు. అదేవిధంగా గుడ్ అండ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సింహాచలం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.