KRNL: సంతకాల సేకరణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పైన జరిగిన దాడిని ఆదివారం పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపైన ఉందని ఆయన డిమాండ్ చేశారు.