ఏలూరు నగరంలోని వంగాయగూడెం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారిపై వర్షపు నీరు పొంగిపొర్లుతుంది. గత రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహన రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.