ELR: పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా నిలుస్తుందని ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఆదివారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన వారికి చెక్కులను అందజేశారు. ఆరోగ్య సమస్యలతో చికిత్స చేయించుకున్న 28 మంది బాధితులకు వైద్యఖర్చుల నిమిత్తం రూ.13,54,635 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గన్ని పంపిణీ చేశారు.