AP: ఆస్ట్రేలియాలోని తెలుగువారు ఏపీ అంబాసిడర్లలా పనిచేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటే తమతో చెప్పాలన్నారు. చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే.. ఏపీలో డబులింజన్ బుల్లెట్ ట్రైన్ ఉందన్నారు. కేంద్రం సహకారం వల్లే విశాఖకు గూగుల్ వచ్చిందన్నారు. గూగుల్‌ను విశాఖకు తెచ్చేందుకు కేంద్రం చట్టాలను సవరించిందని పేర్కొన్నారు.