ప్రకాశం: కంభం మండలం తిమ్మాపురం గ్రామంలో రోజుల తరబడి రోడ్ల మీదే వర్షపు నీరు, మురుగు కలిసి నిల్వ చేరుతున్నాయి. దీంతో ప్రజలు దుర్వాసనే కాక నడకకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి మండల కేంద్రమైన కంభం పంచాయతీకి వెళ్లే దారిలో సమస్య మరీ తీవ్రంగాఉంది. ఆర్అండ్ బీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.