NZB: మొక్కజొన్న కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేయాలని, వరికి యాసంగి బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కమ్మర్పల్లి మండల రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. మొక్కజొన్న,సోయా ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్సై అనిల్ రెడ్డి రైతులతో మాట్లాడి, వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు.