NZ Vs ENG తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండానే ముగిసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు ముందు వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.