WGL: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు కానిస్టేబుళ్ళను ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేశారు. మామునూర్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న యూసుఫ్, శ్రీనివాస్ కానిస్టేబుళ్ళు, స్టేషన్లో గంజాయి కేసులో ఉన్న ఇద్దరు నిందితులు పోలీస్ కస్టడీ నుంచి పారిపోవడంతో విధుల నిర్లక్ష్యంపై సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.