NRML: ఖానాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్‌కు దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను వారు కలిశారు. నవంబర్ 1 నుండి 6 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.