SRCL: కోనరావుపేట మండల కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో ఆదివారం సీఐటీయు పోస్టర్ను జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్ ఆవిష్కరించారు. ఈనెల 26, 27 తేదీలలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే రాష్ట్ర నాలుగో మహాసభలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.