CTR: గంగాధర నెల్లూరు మండలం పెద్దకాల్వ పంచాయతీ ఎల్లమ్మరాజు పల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఎం. కుమారి అనే మహిళ ఇల్లు కోల్పోయింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం. థామస్ ఆమెకు రూ. 50 వేల చెక్కును అందించారు. సంతోషం వ్యక్తం చేసిన ఆమె.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.